గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (11:44 IST)

షాకింగ్ న్యూస్.. తెలంగాణ మంత్రి హరీష్ రావుకి కరోనా

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి కరోనా సోకింది. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. తాజాగా మంత్రి హరీష్ రావుకు కూడా కరోనా సోకడం టీఆర్ఎస్ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావుకి తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కొద్దిపాటి కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. ఈ పరీక్షల్లో ఫలితం పాజిటివ్ వచ్చిందని మంత్రి ట్వీట్ చేశారు.
 
ప్రస్తుతం తన ఆరోగ్యం స్థిమితంగానే ఉందన్న మంత్రి హరీష్ రావు.. గత కొద్ది రోజులుగా తనని కలిసిన వాళ్లు కూడా కరోనా పరీక్షలు చేయించుకుని ఎవరికి వారు ఐసోలేట్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.