సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (10:04 IST)

తెలంగాణలో స్థిరంగా కరోనా కేసులు... 24 గంటల్లో 2,511 కేసులు

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా వున్నాయి. గత కొద్దిరోజుల నుండీ ఈ కేసులు మూడు వేల లోపే నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కరోనా కేసులు మళ్ళీ భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,511 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,38,395కి చేరింది. ఇక శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రంలో 11 మంది కరోనా వలన మృతిచెందారు. దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 877కు చేరింది.
 
ఇప్పటిదాకా కరోనా నుండి 1,04,603 మంది కోలుకోగా శుక్రవారం ఒక్కరోజే 2,579 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 32,915 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అందులో 25,729 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు.
 
ఇక శుక్రవారం ఒక్కరోజే 62,132 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 16,67,653కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 305 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా 184కేసులతో నిలిచింది.