గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (14:04 IST)

ఆమెకు 32 ఏళ్లు.. అతడికి 19 సంవత్సరాలు.. ప్రేమ పేరుతో అత్యాచారం

మహిళలపై కామాంధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. వావి వరుసలు లేకుండా వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా 19 ఏళ్ల యువకుడు 32 ఏళ్ల మహిళపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం సృష్టించింది. హైదరాబాద్, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఎర్రగుంటలో ఉండే 19 ఏళ్ల యువకుడు... అదే ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువతిపై కన్నేశాడు. వయసులో పెద్దది అని కూడా చూడకుండా గత ఏడాది నుంచి ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడి మాయమాటలతో నమ్మించాడు. చివరికి సదరు యువతిని లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఇలా కొన్ని కొన్ని రోజుల పాటు సాగుతూ వచ్చింది. చివరికి పెళ్లి చేసుకోవాలని అడగడంతో మొహం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించి తన గోడును వెల్లబోసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు.