మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: గురువారం, 3 సెప్టెంబరు 2020 (22:45 IST)

వివాహితకు మాయమాటలు చెప్పిన యువకుడు, గర్భవతిని చేసి?

భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆరేళ్ళ కుమార్తెతో కలిసి జీవిస్తోంది. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఇదే అదునుగా భావించిన ఒక యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పాడు. పెళ్ళి చేసుకుంటానంటూ నమ్మబలికాడు. గర్భవతిని చేసి పరారయ్యాడు.
 
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా సారపాకకు చెందిన ఒక మహిళకు ఏడేళ్ళ క్రితం వివాహమైంది. ఆమె భర్త అరటిపండ్లను అమ్మేవాడు. రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి ఆ వివాహిత తన కుమార్తెతోనే కలిసి ఉంటోంది.
 
ఆమె అరటిపండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. అయితే ఇంటి పక్కనే ఉన్న 18 యేళ్ళ యువకుడు ఆ వివాహితకు మాయమాటలు చెప్పాడు. నిన్ను పెళ్ళి చేసుకుంటాను. నీకు కొత్త జీవితం ఇస్తానని నమ్మబలికాడు. ఆమెను లోబరుచుకున్నాడు. సంవత్సరం నుంచి ఆమెతో శారీరక వాంఛ తీర్చుకున్నాడు.
 
అయితే అతడి కారణంగా ఆమె గర్భవతి అయింది ఉంది. తనను పెళ్ళి చేసుకొని కొత్త జీవితం ఇవ్వమని కోరింది. అందుకు ఒప్పుకోకపోగా అతను ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో ఆ మహిళ లబోదిబోమంటూ రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. ఇంటికి కూడా వెళ్ళలేదు. స్ధానికంగా ఉన్న పోలీసులు గుర్తించి ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.