శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (20:33 IST)

విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల వ్యవధిలో 76 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వరుసగా తొమ్మిదో రోజూ 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 59,919 నమూనాలను పరీక్షించగా 10,776 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,76,506కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 76 మంది కరోనాతో మృతిచెందారు.
 
ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో 9 మంది, ప్రకాశం 9, గుంటూరు 8, కడప 8, నెల్లూరు 8, తూర్పుగోదావరి 6, విశాఖపట్నం 6, పశ్చిమగోదావరి 6, కృష్ణా 5, శ్రీకాకుళం 4, అనంతపురం 3, కర్నూలు 2, విజయనగరంలో ఇద్దరు మరణించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. 
 
ఒక్కరోజులో 12,334 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39,65,694 నమూనాలను పరీక్షించారు. తాజా లెక్కలతో కలిపి 1,02,067 కరోనా యాక్టివ్‌ కేసులున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.