శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (11:30 IST)

పశ్చిమ గోదావరి జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా.. 43వేలు దాటిన కేసులు

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు 43 వేలు దాటాయి. జిల్లాలో కొత్తగా 1205 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. గురువారం కరోనాతో ఏడుగురు మృతి చెందారు. తణుకులో కేసుల పెరుగుదల వణుకు పుట్టిస్తోంది. 
 
ఒక్కరోజే 161 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అటు ఏలూరులో 46 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43,739లకు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 334మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు కొత్తగా కేసులు నమోదైన 14 ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయగా... 61 ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లను అధికారులు ఎత్తివేశారు. 
 
మరోవైపు దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే 39 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం ఇండియాలో కొత్తగా 83,341 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 39,36,748కి చేరింది. ఇందులో 8,31,124 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 30,37,152 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 
 
గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1096 మరణాలు సంభవించాయి. దీంతో భారత్‌లో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 68,472కి చేరింది. కరోనా కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది.