మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (21:22 IST)

యూపీలో కరోనా వైరస్ విజృంభణ.. 75మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గురువారం కొత్తగా 75మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,691కి పెరిగింది. కేసుల సంఖ్య 2,47,101కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 57,598 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా బారినుంచి కోలుకుని 1,85,812 మంది డిశ్చార్జ్ అయినట్టు వైద్య, ఆరోగ్యశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు.
 
రాష్ట్రంలో గురువారం మొత్తం 2,41,439 కేసులు నమోదు కాగా, గురువారం సంఖ్య 2,47,101 పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం 1,36,803 మందికి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 60 లక్షలు దాటింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 57,598 యాక్టివ్ కేసుల్లో 29,588 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు అమిత్ మోహన్ తెలిపారు.