గృహలక్ష్మీ సీరియల్‌ నటుడికి కరోనా.. ఆయనతో కలిసి తిరిగాడట..

Corona
corona
సెల్వి| Last Updated: శుక్రవారం, 26 జూన్ 2020 (12:11 IST)
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ సడలింపులు తర్వాత మరింతగా విజృంభించింది. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా టాలీవుడ్‌లో సీరియల్స్‌తో పాటు సినిమాలకు షూటింగ్ చేసుకునే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అందులో భాగంగా వివిధ ఛానల్స్‌కు చెందిన సీరియల్ యాజమాన్యాలు షూటింగ్‌ను ప్రారంభించాయి.

అయితే షూటింగ్ జరుపుతున్న వేళ ప్రభాకర్ అనే టీవీ నటుడికి కరోనా అని తేలింది. ఆయన ఇటీవల ఓ సీరియల్ షూటింగ్‌లో పాల్గొనడంతో కలలం రేగింది. ఆ షూటింగ్ లో పాల్గొన్న సిబ్బంది అంతా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. అంతేకాదు సదరు టీవీ సీరియల్ షూటింగ్ కూడా ఆగిపోయింది.

ఈ నటుడు జీ తెలుగులో ప్రసారం అయ్యే సూర్యకాంతం సీరియల్‌లో నటిస్తాడని తెలుస్తోంది. అయితే తాజాగా మరో సీరియల్‌ నటుడు హరికృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. హరికృష్ణ ప్రస్తుతం గృహలక్ష్మీ సీరియల్‌లో నటిస్తున్నాడు. హరికృష్ణ ఇటీవలే కరోనా సోకిన ప్రభాకర్‌తో కలిసి తిరిగాడని తెలుస్తోంది. దీంతో ఆ సీరియల్ యూనిట్ మొత్తం వణికిపోతుంది.దీనిపై మరింత చదవండి :