శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (09:44 IST)

రోజుకో రికార్డు సృష్టిస్తున్న కరోనా - కొత్తగా 17 వేల కేసులు

కరోనా వైరస్ మహమ్మారి దేశంలో రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. గురువారం 16 వేల కేసులు నమోదు కాగా శుక్రవారం ఈ సంఖ్య 17 వేలు దాటాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17,296 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 
 
ఈ ప్రాణాంతక మహమ్మారి వల్ల ఒకేరోజు 407 మంది బాధితులు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,90,401కి చేరగా, మృతుల సంఖ్య 17,296కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 1,89,463 యాక్టివ్‌ కేసులు ఉండగా, 2,85,637 మంది బాధితులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. 
 
దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 4841 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తంగా 1,47,741 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 6,931 మంది బాధితులు మృతిచెందగా, 77,453 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 63,357 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 
ఇక రెండో స్థానంలో ఉన్న ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 73,780కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2429 మంది బాధితులు మృతి చెందారు. దేశ రాజధానిలో గురువారం ఒక్కరోజే 3390 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 64 మంది మరణించారు. 
 
దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఇప్పటివరకు 70,977 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 911 మంది మృతిచెందారు. నాలుగో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 29,520 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1753 మంది మరణించారు.