Webdunia - Bharat's app for daily news and videos

Install App

కఠినంగా లాక్ డౌన్.. తాట తీస్తున్న పోలీసులు.. ఐసోలేషన్‌ సెంటర్‌కు పంపేశారు..

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 6 జూన్ 2021 (21:12 IST)
కరోనాను నియంత్రించేందుకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో... పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా అనవసరంగా బయట తిరిగే యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. 
 
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. 
 
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బయట తిరుగుతున్న 14 మంది ఆకతాయిలకు కరోనా రాపిడ్ టెస్టులు నిర్వహించి, ఐసోలేషన్‌కు తరలించారు. జైపూర్, పెగడపల్లి, గంగిపల్లి, ఎలకంటీ, షేట్ పల్లి, గ్రామాలలో పెట్రోలింగ్ చేస్తుండగా యువకులు బలాదూర్‌గా తిరగుతూ పోలీసులకు చిక్కారు. 
 
కరోనాతో తమకు సంబంధం లేదన్నట్టు బాధ్యతా రాహిత్యంతో నిబంధనలు గాలికి వదిలి బయట తిరుగుతున్నారు. దీంతో 14 మందిని పట్టుకొని వారికి రాపిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. వారందరికీ నెగిటివ్ వచ్చినా.. నిబంధనలు ఉల్లంఘించినందుకు బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.
 
జైపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. అనవసరంగా బయట తిరిగే వ్యక్తులకు రాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని లేదంటే ఐసోలేషన్‌కు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు.

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments