మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి

క్రిస్ గేల్ అద్భుత రికార్డు.. 78 పరుగులు బౌండరీలతోనే.. ఫిఫ్టీ రికార్డుతో..?

లెజండరీ వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్ గేల్ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 సూపర్ స్టార్ క్రిస్ గేల్ 22 బంతుల్లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 84 పరగులు సాధించాడు. అబుదాబి టీ10 లీగ్‌లో తన మార్క్‌ బ్యాటింగ్‌తో రికార్డు నెలకొల్పాడు. యూనివర్స్‌ బాస్‌ టీ10 లీగ్‌లోనే అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీని నమోదు చేశాడు.
 
అబుదాబిలోని షేక్‌ జాయెద్‌ స్టేడియంలో టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో అబుదాబి టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్‌ మరాఠా అరేబియన్స్‌ బౌలర్లను ఉతికారేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన గేల్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. గేల్‌ సాధించిన 84 పరుగులలో 78 రన్స్‌ బౌండరీల ద్వారానే వచ్చాయి.
 
గేల్‌ తన అర్ధసెంచరీని 12 బంతుల్లోనే పూర్తి చేసి టీ10 చరిత్రలో గతంలో నమోదైన వేగవంతమైన ఫిఫ్టీ రికార్డును సమం చేశాడు. 2018 సీజన్‌లో రాజ్‌పుత్‌ జట్టు ఆటగాడు మహ్మద్‌ షాజాద్‌ ఫాస్టెస్ట్‌ అర్ధశతకం ఈ ఫీట్‌ సాధించాడు. సూపర్‌ఫామ్‌లో ఉన్న గేల్‌ అబుదాబి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.