సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 20 నవంబరు 2023 (11:41 IST)

కంగారుల చేతిలో భారత్‌కు భంగపాటు.. భర్త కోహ్లీని ఓదార్చిన అనుష్క

anushka kohli
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమితో విరాట్ కోహ్లీ కంట కన్నీరు కనిపించింది. ఆ సమయంలో తన భర్తను అనుష్క శర్మ ఓదార్చరు. కష్ట సమయంలో భర్తకు అండగా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. 
 
కాగా, ఈ టోర్నీలో లీగ్ దశ నుంచి సెమీస్ వరకు వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్న టీమిండియా చివరి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీన్ని భారత క్రికెటర్లు మాత్రమేకాదు.. కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు. క్రికెటర్లు అయితే, తీవ్ర విషాదంతో పాటు విచారమలో కూరుకునిపోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటివారు మైదానంలోనే కన్నీరు పెట్టేశారు. 
 
ఈ పరిస్థితుల్లో తీవ్ర విచారంలో కూరుకుని పోయిన కోహ్లీకి భార్య అనుష్క శర్మ అండగా నిలిచారు. భర్తను కౌగలించుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇందుకు సంంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో అనుష్కపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్ట సమయంలో జీవిత భాగస్వామికి వెన్నంటి నిలుస్తుందంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. పైగా, అనుష్క కోహ్లీలు ఆదర్శ దంపతులంటూ కితాబిచ్చారు.