గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (22:28 IST)

విరాట్ కోహ్లీకి జూనియర్ వచ్చేశాడోచ్... పండంటి బాబుకు జన్మనిచ్చిన అనుష్క

Virat Kohli_ Anushka Sharma
Virat Kohli_ Anushka Sharma
టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య, బాలీవుడ్ నటి అనూష్క శర్మ పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ బాబు.. కోహ్లీ దంపతులకు రెండో సంతానం. ప్రస్తుతం వారికి ఓ కుమార్తె ఉంది. పేరు వామిక. కిందటి నెలతో వామిక మూడో సంవత్సరంలో అడుగు పెట్టింది.
 
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడట్లేదు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ సిరీస్‌కు దూరమైనట్లు కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. ప్రసవ సమయంలో భార్యకు దగ్గరగా ఉండాలనే కారణంతో సిరీస్ నుంచి తప్పుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
 
అనుష్క శర్మ విరాట్ కోహ్లీల వివాహం డిసెంబర్ 2017లో జరిగింది. అనుష్క శర్మ 2018లో తన చిత్రం జీరో విడుదలైన తర్వాత నటనకు విరామం తీసుకుంది. ఈ జంట జనవరి 2021లో వారి కుమార్తె వామికను స్వాగతించారు. 
 
అప్పటి నుండి, అనుష్క ఏ సినిమాలోనూ పని చేయలేదు. ఆమె స్పోర్ట్స్ డ్రామా చక్దా ఎక్స్‌ప్రెస్‌తో తిరిగి రానుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.