బుధవారం, 18 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2024 (19:34 IST)

రెండో బిడ్డను ఆహ్వానించేందుకు కోహ్లీ, అనుష్క రెడీ-ఏబీ డివిలియర్స్

kohli couple
విరుష్క దంపతులు ఈ ఏడాది రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని.. కోహ్లికి మంచి స్నేహితుడైన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ధ్రువీకరించారు. దీంతో అనుష్క శర్మ ప్రెగ్నెన్సీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టుల నుంచి కోహ్లీ వ్యక్తిగత కారణాలతో వైదొలిగాడు.  
 
విరాట్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వమని ఓ అభిమాని డివిలియర్స్ అడగగా.. తన యూట్యూబ్ ఛానెల్‌లో విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం తమ రెండవ బిడ్డను ఆహ్వానించేందుకు కోహ్లీ, అనుష్క రెడీగా ఉన్నారు.
 
తాను ఎక్కువ సమాచారం ఇవ్వలేను కానీ ప్రస్తుతం విరాట్ తన కుటుంబంతో కొంత సమయం గడుపుతున్నాడని చెప్పారు. ఇంగ్లండ్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యేందుకు అదే కారణమన్నారు. అయితే ఈ విషయంపై స్టార్ కపుల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.