బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 జనవరి 2024 (11:28 IST)

అయోధ్యలో విరాట్ కోహ్లీ, సచిన్.. సెల్ఫీల కోసం ఎగబడ్డారు..

Kohli
Kohli
యూపీలో అయోధ్య రామ్ ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలను పోలిన వ్యక్తులు సందడి చేశారు. అందరూ ఒక్కసారిగా జెర్సీ ధరించిన విరాట్, సచిన్‌ డూప్‌లతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఈ వీడియోలో, కోహ్లీ నీలిరంగు జెర్సీ, క్యాప్‌తో కనిపించాడు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగే రెండు టెస్టులకు దూరమవుతాడని బీసీసీఐ తెలిపింది. ఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌పై 28 టెస్టుల్లో 42.36 సగటుతో 1991 పరుగులు చేసి 235 పరుగుల రికార్డును కలిగి ఉన్నాడు.