అయోధ్య ప్రాణ్ ప్రతిష్ట.. భారత క్రికెట్ స్టార్లకు ఆహ్వానం.. ఎవరికి ఫస్ట్?
అయోధ్యలోని రామమందిరపు 'ప్రాణ్ ప్రతిష్ట' వేడుకకు పలువురు భారత క్రికెట్ స్టార్లకు ఆహ్వానం అందింది. జనవరి 22, 2024న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీని కోసం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. పలువురు క్రికెటర్లకు కూడా ఆహ్వానం అందింది.
ఇందులో భాగంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రామ మందిరానికి అధికారికంగా ఆహ్వానం అందుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచారు. అలాగే 'ప్రాణ్ ప్రతిష్ఠ' ఆహ్వానం ఎంఎస్ ధోనీకి కూడా అందింది. దీనికి సంబంధించిన ఫోటో సోమవారం (జనవరి 15) వైరల్ అయ్యింది.
కాగా, మంగళవారం (జనవరి 16) రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుక కోసం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ఆహ్వానం అందింది. ఈ క్రమంలో కోహ్లీకి బీసీసీఐ అనుమతినిచ్చింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శాస్త్రోక్తంగా అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అయోధ్యలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.