మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr

భారత్ చేతిలో ఓటమికి సంపూర్ణ అర్హులం : ఆస్ట్రేలియా కెప్టెన్

భారత చేతిలో ఓడిపోవడానికి సంపూర్ణ అర్హులమంటూ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఆస్ట్రేలియా ఐదు వన్డే సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయిన విషయం తెల్సిందే. ఆదివారం నా

భారత చేతిలో ఓడిపోవడానికి సంపూర్ణ అర్హులమంటూ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఆస్ట్రేలియా ఐదు వన్డే సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయిన విషయం తెల్సిందే. ఆదివారం నాగ్‌పూర్ వేదికగా జరిగిన చివరి వన్డేలోనూ ఆసీస్ జట్టు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ స్పందిస్తూ... సిరీస్‌లో ఈ పరాభవానికి తాము అర్హులమేనని అభిప్రాయపడ్డారు. 
 
ఇకనుంచి రాబోయే సిరీస్‌లలోనైనా స్థిరమైన ఆటతీరుతో రాణించాల్సిన అవసరముందని చెప్పాడు. నాగ్‌పూర్‌లో జరిగిన ఐదో వన్డేలో ఆసీస్‌ విసిరిన 243 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ సునాయసంగా ఛేదించింది. రోహిత్‌ శర్మ సెంచరీ సాధించి సత్తా చాటడంతో 43 బంతులు ఉండగానే భారత్‌ విజయాన్ని అందుకొని.. 4-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
 
మొదట బ్యాటింగ్‌ చేసిన తమ జట్టు 50-60 పరుగులు తక్కువ రాబట్టడం వల్లే ఓటమిపాలైందని, నాగపూర్‌ వికెట్‌పై 300లకుపైగా పరుగులు చేస్తే తమకు విజయ అవకాశాలు ఉండేవని స్మిత్‌ చెప్పుకొచ్చాడు. '300 పరుగులు చేస్తే బాగుండేది. మా టాప్‌ ఫోర్‌ బ్యాట్స్‌మెన్‌లో ఒకరు భారీ స్కోరు చేసి ఉండాల్సింది. వరుసగా వికెట్లు కోల్పోయాం. ఇకనుంచైనా మమ్మల్ని మేం మెరుగుపరుచుకొని స్థిరమైన ఆటతీరు కనబర్చాల్సి ఉంది. స్థిరమైన ఆటతీరుకు అనుగుణమైన సమన్వయాన్ని మేం సాధించాలి. ఆటలో మమ్మల్ని చిత్తుచేశారు. 4-1 తేడాతో సిరీస్‌ ఓటమికి మేం అర్హులమే' అని వ్యాఖ్యానించాడు.