శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 25 ఫిబ్రవరి 2017 (15:14 IST)

చెత్తచెత్తగా చిత్తుచిత్తుగా ఓడిన టీమ్ ఇండియా... 333 పరుగుల తేడాతో ఓడించిన ఆసీస్....

టీమ్ ఇండియా సొంతగడ్డపై వరుస టెస్ట్ సిరీస్‌లకు బ్రేక్ కొడుతూ ఆసీస్ 333 భారీ పరుగుల ఆధిక్యంతో టీమ్ ఇండియాను ఓడించింది. భారత జట్టు ఏ దశలోనూ నైపుణ్యమైన ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. మొన్నటివరకూ ఆహాఓహో అంటూ కోహ్లికి భజన చేసినవారు ఇప్పుడు రివర్స్ గేర్ తీస

టీమ్ ఇండియా సొంతగడ్డపై వరుస టెస్ట్ సిరీస్‌లకు బ్రేక్ కొడుతూ ఆసీస్ 333 భారీ పరుగుల ఆధిక్యంతో టీమ్ ఇండియాను ఓడించింది. భారత జట్టు ఏ దశలోనూ నైపుణ్యమైన ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. మొన్నటివరకూ ఆహాఓహో అంటూ కోహ్లికి భజన చేసినవారు ఇప్పుడు రివర్స్ గేర్ తీసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చివరికి 440 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది టీమ్ ఇండియా.
 
దీనితో 4 టెస్ట్ సిరీస్‌లలో భాగంగా ఆసీస్ 1-0తో ముందుంది. పైగా సొంత గడ్డపై గత 12 ఏళ్లుగా టెస్ట్ సిరీస్‌లో తిరుగులేని విజయాలను చవిచూస్తున్న దశలో కోహ్లి సేన ఆ రికార్డును చెరిపేసింది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 105 పరుగులు చేసింది. అలాగే రెండో ఇన్నింగ్స్ 107 పరుగులు చేయగా ఆసీస్ తన తొలి ఇన్నింగ్సులో 260 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్సులో 285 పరుగులు చేసింది. దీనితో భారత జట్టు ముందు 440 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. దీన్ని ఛేదించడంలో టీమ్ ఇండియా చతికిలపడింది.