అజహర్ అలీ అరుదైన రికార్డు.. క్యాలెండర్ ఇయర్‌లో 1000 రన్స్.. పాక్ నాలుగో ఆటగాడిగా?
పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ అజహర్ అలీ అరుదైన రికార్డును కైవసం చేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన ఐదో పాకిస్థాన్ ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న రెండో టెస్టు
పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ అజహర్ అలీ అరుదైన రికార్డును కైవసం చేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన ఐదో పాకిస్థాన్ ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న రెండో టెస్టులో అజహర్ ఈ రికార్డుతో ఘనతకెక్కాడు.
అంతకుముందు పాకిస్తాన్ క్రికెటర్ మోసిన్ ఖాన్, ఇంజమామ్ వుల్ హక్, యూసఫ్, యూనిస్ ఖాన్‌లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు సాధించిన ఆటగాళ్లుగా రికార్డు కెక్కారు. ఇందులో యూనిస్ ఖాన్ రెండు సార్లు వెయ్యి పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
కాగా ఆస్ట్రేలియాతో టెస్టులో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ తొలిరోజు పదే పదే వర్షం పడటంతో 50.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 142 పరుగులు సాధించింది.