సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (10:00 IST)

హోటల్ రూమ్‌లకు అమ్మాయిల్ని తీసుకెళ్లిన బంగ్లాదేశ్ క్రికెటర్లు.. భారీ ఫైన్

బంగ్లాదేశ్ క్రికెటర్లు క్రమశిక్షణను ఉల్లంఘించారు. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించి హోటల్ రూమ్‌లకు అమ్మాయిలను తీసుకెళ్లారన్న ఆరోపణలు రావడంతో కఠిన చర్యలు తీసుకున

బంగ్లాదేశ్ క్రికెటర్లు క్రమశిక్షణను ఉల్లంఘించారు. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించి హోటల్ రూమ్‌లకు అమ్మాయిలను తీసుకెళ్లారన్న ఆరోపణలు రావడంతో కఠిన చర్యలు తీసుకున్నట్టు సమాచారం.
 
బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌) సందర్భంగా మైదానం వెలుపల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పేసర్‌ అల్‌ అమీన్‌ హొస్సేన్‌, బ్యాట్స్‌మన్‌ సబ్బీర్‌ రహ్మాన్‌కు రూ. 10 లక్షల చొప్పున జరిమానా విధించినట్టు బంగ్లా క్రికెట్‌ బోర్డు (బీసీబీ) ఓ ప్రకటనలో తెలిపింది. టూర్ సందర్భంగా ఇద్దరు ఆటగాళ్లు హోటల్ రూమ్‌లకు మహిళలను తీసుకెళ్లినట్లు ఓ పత్రిక పేర్కొంది.