శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2017 (11:28 IST)

ఇంటివాడు కాబోతున్న భారత పేసర్ భువనేశ్వర్ కుమార్

భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు నూపుర్‌ నగార్‌ను వివాహం చేసుకోనున్నాడు. వీరిద్దరి నిశ్చితార్థం తాజాగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నోయిడాలో

భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు నూపుర్‌ నగార్‌ను వివాహం చేసుకోనున్నాడు. వీరిద్దరి నిశ్చితార్థం తాజాగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నోయిడాలో బుధవారం ఈ వేడుక జరిగింది. వీరిద్దరి వివాహం మాత్రం డిసెంబరు నెలలో జరుగనుంది. 
 
వీరిద్దరు చిన్ననాటి స్నేహితులు. వీళ్ల కుటుంబాలు మీరట్‌లోని గంగానగర్‌లో ఇరు పొరుగున నివాసం ఉండేవి. అదేవిధంగా భువీ తండ్రి కిరణ్‌ పాల్‌ సింగ్‌, నగార్‌ తండ్రి యశ్‌పాల్‌ సింగ్‌ ఇద్దరూ యూపీ పోలీసు అధికారులు. దాంతో, పిల్లల ప్రేమ పెళ్లికి ఈ ఇద్దరూ పచ్చజెండా ఊపారు. 
 
కాగా, ఎంగేజ్‌మెంట్‌ వరకూ నూపుర్‌ వివరాలను భువీ దాచిపెట్టడం విశేషం. నూపుర్‌‌తో కలిసి డిన్నర్‌ చేస్తున్న ఫొటోనూ మంగళవారమే తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసి ఆమెను అందరికీ పరిచయం చేశాడు.