రేపు చాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ : భారత్ - పాకిస్థాన్ గెలుపోటములు ఇవే...
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, ఈ నెల 23వ తేదీన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్‌లో జరుగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్లు తేడాతో విజయం సాధించిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండగా, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. సెమీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో ఎంతో కీలకం.
ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు, పరుగులు, వికెట్లు, అత్యధిక స్కోరు, గెలుపోటములు వంటి వివరాలు గురించి తెలుసుకుందాం. భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య ఇప్పటివరకు 135 వన్డేలు జరిగాయి పాకిస్థాన్ 73 మ్యాచ్‌లలో విజయం సాధించింది.
అత్యధిక స్కోరు రూ.356/9, విశాఖపట్టణంలో 2005 ఏప్రిల్ జరిగిన మ్యాచ్‌లో భారత్ ఈ స్కోరు సాధించింది. 2023 సెప్టెంబరు 10న కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 2 వికెట్లు నష్టానికి 356 పరుగులు చేసింది.
1978 అక్టోబరు 13న సియోల్ కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 34.2 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌట్ అయింది. 2023 సెప్టెంబరు 10వ తేదీన పాకిస్థాన్‌పై భారత్ 228 పరగులు భారీ తేడాతో విజయం సాధించింది.