ఐసీసీ ర్యాంకుల పట్టిక : అగ్రస్థానంలో సౌతాఫ్రికా... మూడో స్థానంలో భారత్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించిన ర్యాంకుల పట్టికలో దక్షిణాఫ్రికా మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొదటి స్థానాన్ని కోల్పోయిన భారత్.. మూడో స్థానానికి చేరుకుంది. రెండో స్థానాన్ని ఆస్ట్రే
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించిన ర్యాంకుల పట్టికలో దక్షిణాఫ్రికా మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొదటి స్థానాన్ని కోల్పోయిన భారత్.. మూడో స్థానానికి చేరుకుంది. రెండో స్థానాన్ని ఆస్ట్రేలియా దక్కించుకుంది. 2016 మే 1వ తేదీ తర్వాత ఆడిన మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుని ఐసీసీ తాజా ర్యాంకులను నిర్ణయించింది.
కాగా, 2019 ప్రపంచకప్‌లోకి నేరుగా ఎంట్రీ కావాలంటే ఉండాల్సిన 8వ స్థానాన్ని మాత్రం పాకిస్థాన్ కైవసం చేసుకుంది. 2017 సెప్టెంబర్ 30 నాటికి ఇంగ్లండ్‌తో పాటు టాప్ 7 ర్యాంకుల్లో ఉన్న జట్లు 2019 ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధిస్తాయి. ఈసారి ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరుగుతుండటంతో ఆ జట్టుకు అర్హత దానంతట అదే వస్తుంది.
జట్ల వివరాలు...1.దక్షిణాఫ్రికా 2. ఆస్ట్రేలియా 3. ఇండియా 4. న్యూజిలాండ్ 5. ఇంగ్లాండ్ 6. శ్రీలంక 7. బంగ్లాదేశ్ 8. పాకిస్థాన్ 9. వెస్ట్ ఇండీస్ 10. ఆఫ్ఘనిస్థాన్ 11. జింబాబ్వే 12. ఐర్లాండ్.