శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (17:03 IST)

వైజాగ్‌లో 'మయాంక్' మాయ ... తొలి టెస్టులోనే డబుల్ సెంచరీ (video)

భారత క్రికెట్ జట్టు క్రికెటర్ మయాంక్ అగర్వాల్ విశాఖపట్టణంలో మాయ చేశారు. ఈ టెస్టులో టెస్టులోనే డబుల్ సెంచరీ బాదాడు. అంటే టెస్టుల్లో తాను ఆడిన ఎనిమిదో ఇన్నింగ్స్‌లో తొలి డబుల్ సెంచరీ కొట్టాడు. ఈ కర్నాటక కుర్రోడు క్రీజ్‌లో పాతుకుపోవడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. 
 
ప్రస్తుతం సౌతాఫ్రికాలో భారత్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా తొలి టెస్టు విశాఖపట్టణం వేదికగా బుధవారం ప్రారంభమైంది. ఇందులో కర్నాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు. అగర్వాల్ అద్భుతమైన రీతిలో డబుల్ సెంచరీ సాధించాడు. 
 
పట్టుమని 10 టెస్టుల అనుభవం కూడా లేని మయాంక్ దక్షిణాఫ్రికా వంటి పటిష్టమైన జట్టుపై సెంచరీ సాధించడమే గొప్ప అనుకుంటే, అద్వితీయమైన రీతిలో 200 పరుగులు పూర్తిచేసి సగర్వంగా అభివాదం చేశాడు. దూకుడుకు సంయమనం జోడించి, అద్భుతమైన టెక్నిక్ మేళవించి సఫారీ బౌలర్లను ఆటాడుకున్నాడు. 
 
మొత్తం 371 బంతులు ఎదుర్కొన్న మయాంక్.. 23 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 215 పరుగులు చేశాడు. మయాంక్ మాత్రం తన డబుల్ సెంచరీని 358 బంతుల్లో 22 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 200 పరుగులు తీశాడు. 
 
అలా తాను చేసిన తొలి సెంచరీనే డబుల్‌ సెంచరీ చేశాడు. మయాంక్ అగర్వాల్ 215 పరుగుల స్కోరు వద్ద పార్ట్ టైమ్ బౌలర్ డీన్ ఎల్గార్ బంతికి వెనుదిరిగాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా, హనుమ విహారి క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆట మధ్యాహ్నం సెషన్‌లో భారత్ 5 వికెట్లు కోల్పోయి 436 పరుగులతో ఆడుతోంది. 
 
అంతకుముందు మరో ఓపెనర్ రోహిత్ శర్మ (176) సెంచరీ చేసిన విషయం తెల్సిందే. అలాగే, పుజారా 6, కోహ్లీ 20, రహానే 15 చొప్పున పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 2, మరో స్పిన్నర్ ముత్తుస్వామి సేనురాన్, పేసర్ ఫిలాండర్, ఎల్గార్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.