ఐపీఎల్-9: కింగ్స్ ఎలెవన్‌పై రాయల్ ఛాలెంజర్స్ ఇంట్రెస్టింగ్ విన్.. ఒక్క పరుగు తేడాతో?!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపును నమోదు చేసుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే పరుగుతో రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు… 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. డివిలియర్స్ 64, రాహుల్ 42, సచిన్ బీబీ 33, కోహ్లీ 20 పరుగులు సాధించారు. లక్ష్యాన్ని చేధించే క్రమంలో దూకుడుగా ఆడిన పంజాబ్.. మ్యాచ్‌కు చివర్లో బోల్తా పడింది. చివరి ఓవర్లో 17 రన్స్ చేయాల్సి ఉందనగా… 15 రన్స్ మాత్రమే చేయగలిగింది. 57 బాల్స్‌లో 89 రన్స్ చేసి… పంజాబ్‌ను రేసులోకి తెచ్చిన మురళీ విజయ్ ఇన్నింగ్స్ శ్రమ వృధా అయ్యింది.