'Fun time with the family' అంటూ ధోనీ వీడియో
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలిసారి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడిపాడు. దీనికి సంబంధించి ఫన్ టైమ్ విత్ ది ఫ్యామిలీ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలిసారి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడిపాడు. దీనికి సంబంధించి ఫన్ టైమ్ విత్ ది ఫ్యామిలీ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే పది లక్షల మంది వరకు వీక్షించడం గమనార్హం.
ఈ వీడియోలో ధోనీ, ఆయన భార్య సాక్షి, కూతురు జీవా, ధోనీ పెంపుడు శునకాలు కూడా ఈ వీడియోలో కనపడటం గమనార్హం. ధోనీ తన కూతురు జీవాను ఒళ్లో కూర్చుబెట్టుకోగా, భార్య సాక్షి అతని పక్కనే కూర్చునివుంది. ధోనీ తన చేతిలోని బాల్ విసిరి వేయగానే పెంపుడు శునకాల్లో ఒకటి తన నోటితో దానిని పట్టుకునే దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఆ వీడియోను మీరూ ఓసారి తిలకించండి.