క్రికెటర్ రిషబ్ పంత్ భూమి వివాదం.. సానుకూలంగా స్పందించిన సీఎం
Rishab Pant
నమస్కారం సర్.. ఎలా ఉన్నారు? నేను ఉత్తరాఖండ్‌లో స్థిరపడాలని భావిస్తున్నా. అందుకోసం అనువైన, విశాలమైన స్థలం కోసం మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా. కానీ, నాకు సరైన స్థలం దొరకడం లేదు. ఉత్తరాఖండ్ అంటే నాకు చాలా ఇష్టం. భూమిని సమకూర్చడంలో నాకు మీ సహాయం కావాలి. గతంలో నాకు కేటాయించాల్సిన భూమి విషయం కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
నా సొంత ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అనుకుంటున్నా. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి సాయం చేయండి.. అని రిషభ్ పంత్ అర్ధరాత్రి 12.46 గంటలకు పంత్ ఖాతా నుంచి పోస్ట్‌లు వచ్చాయి. రిషభ్ పంత్ ట్వీట్‌కు ఉత్తరాఖండ్ సీఎం ఉదయం 8.54 గంటలకు సానుకూలంగా స్పందించారు.
రిషభ్ పంత్ మీరు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గర్వకారణం. అద్భుతమైన ప్రదర్శన, విజయాలతో దేవభూమి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారు. మాతృభూమిపై మీకున్న ప్రేమ, ఇక్కడికి తిరిగి వచ్చి అభివృద్ధిలో భాగం కావాలనుకునే ఆకాంక్ష అభినందనీయం. మీరు అడిగిన అంశాలకు సంబంధించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తాం. వారు త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తారు.. అని ఉత్తరఖాండ్ సీఎం పంత్ ట్వీట్‌కు బదులిచ్చారు.
