శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 నవంబరు 2024 (11:15 IST)

పాకిస్థాన్ వైట్‌బాల్‌ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డు

Rizwan
Rizwan
పాకిస్థాన్ వైట్‌బాల్‌ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఈ ప్రత్యేకమైన క్లబ్‌లో చేరిన తొమ్మిదో వికెట్ కీపర్‌గా నిలిచాడు. శుక్రవారం అడిలైడ్ ఓవల్‌లో ఆసీస్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో పాకిస్థాన్ ఘ‌న విజ‌యం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ ఏకంగా ఆరు క్యాచ్‌లు అందుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల‌లో ఏడుగురు క్యాచ్ ఔట్ కాగా, ఆరుగురు రిజ్వాన్‌కే చిక్క‌డం విశేషం. త‌ద్వారా ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు పట్టిన 12వ ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడు. ఇక ఈ రెండో వ‌న్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జ‌ట్టు 163 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. 
 
ఆ తర్వాత 164 ప‌రుగుల‌ స్వ‌ల్ప‌ ల‌క్ష్య‌ఛేద‌న‌కు దిగిన‌ పాకిస్థాన్‌ 141 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘ‌న‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో మెన్ ఇన్ గ్రీన్ ఆస్ట్రేలియాతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కాగా, 1996 తర్వాత ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో పాకిస్థాన్ గెల‌వ‌డం ద్వారా చరిత్రను తిర‌గ‌రాసింది.