బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 మార్చి 2024 (19:09 IST)

స్మోకింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఇమాద్ వసీమ్

Imad Wasim
Imad Wasim
పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్ చిక్కుల్లో పడ్డాడు. 35 ఏళ్ల ఇమాద్ వసీమ్ పాకిస్థాన్ జట్టుకు దూరమై దాదాపు ఏడాది అవుతుంది. జట్టులో చోటు కోల్పోయిన అతడు టీ20 లీగుల్లో ఆడుతున్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున పీఎస్‌ఎల్ బరిలోకి దిగిన ఇమాద్ వసీమ్ టైటిల్ తుదిపోరులో సంచలన ప్రదర్శన చేశాడు. 
 
కానీ స్మోకింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో ప్రశంసలకు బదులుగా విమర్శలు దుకుంటున్నాడు. దీని గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంకా స్పందించలేదు. ఇక పీఎస్‌ఎల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఇస్లామాబాద్ యునైటెడ్ ఛాంపియన్‌గా నిలిచింది.