1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. PNG make history by qualifying for Twenty20 World Cup

ఆస్ట్రేలియాలో టీ-20 వరల్డ్ కప్.. కొత్తగా రెండు జట్లు

PNG
ఆస్ట్రేలియాలో నిర్వహించే ట్వంటీ-20 ప్రపంచ కప్‌కు రెండు కొత్త జట్లు అర్హత సాధించాయి. వచ్చే ఏడాది ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ క్రమంలో పపువా న్యూ గునియా(పీఎన్‌జీ) ఆదివారం అర్హత సాధించగా అంతకుముందే ఐర్లాండ్‌ జట్టు మెగా ఈవెంట్‌లో చోటు దక్కించుకుంది. 
 
ఆదివారం కెన్యాతో తలపడిన మ్యాచ్‌లో పీఎన్‌జీ తొలుత 19 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా, నార్మన్‌(54) బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు విలువైన 118 పరుగులు అందించాడు. లక్ష్య సాధనలో కెన్యా 18.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. పీఎన్‌జీ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.
 
అయితే, ఈ మ్యాచ్‌ గెలిచినా ఆ జట్టు మెగా ఈవెంట్‌కు తొలుత అర్హత సాధించలేదు. ఫలితం మరో మ్యాచ్‌పై ఆధారపడటమే అందుకు కారణం. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 12.3 ఓవర్లలో నిర్ణీత లక్ష్యం చేరుకోకపోవడంతో నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా పీఎన్‌జీ అర్హత సాధించింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బంగ్లాదేశ్ ట్వంటీ20 జట్టు కెప్టెన్‌పై వేటు.. భారత్ పర్యటనకు అనుమానమే!