శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2016 (19:36 IST)

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. పూజారా, విజయ్‌ల సెంచరీల మోత.. భారత స్కోర్ 319/4

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో భారత ఆటగాళ్లు పుజారా, విజయ్‌లు ప్రత్యేకమైన రికార్డ్ సాధించారు. ఈ మ్యాచ్‌లో విజయ్ 126, పుజారా 124 రన్స్‌తో సెంచరీలు చేయగా 209 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో భారత ఆటగాళ్లు పుజారా, విజయ్‌లు ప్రత్యేకమైన రికార్డ్ సాధించారు. ఈ మ్యాచ్‌లో విజయ్ 126, పుజారా 124 రన్స్‌తో సెంచరీలు చేయగా 209 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత ఆటగాళ్లు గత పదేళ్లలో సాధించిన భాగస్వామ్యాల్లో వీరిది అత్యుత్తమంగా నిలిచారు. ఇరువురు కలిసి 2081 పరుగులు సాధించారు. వీరి తర్వాత ద్రవిడ్, గంభీర్‌ల జోడీ 2065 పరుగులతో ఉన్నారు.
 
రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత ఆటగాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. తొలి రెండు రోజులు ఇంగ్లండ్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలతో కదం తొక్కగా, మూడో రోజు భారత్ రెండు సెంచరీలతో ధీటుగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 537 పరుగులవద్ద ఇన్నింగ్స్ ముగియడంతో రెండో రోజు టీమిండియా 63 పరుగులు చేసింది.
 
శుక్రవారం మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత ఆటగాళ్లు సెంచరీల మోత మోగించారు. గంభీర్ కేవలం 29 పరుగులకే నిరాశపరిచినా, మురళీ విజయ్, పూజారా ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశారు. పూజారా విజయ్ కంటే ముందే సెంచరీ సాధించాడు. అనంతరం దూకుడు మరింత పెంచే క్రమంలో కెప్టెన్ కుక్‌కు సెకెండ్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి 124 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

ఇదే తరహాలో మరో సెంచరీతో అదరగొట్టిన మురళీ విజయ్ 126 పరుగుల అవుట్ అయ్యాడు. దీంతో మూడోరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 108.3 ఓవర్లలో 319 పరుగులు చేసింది.