శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (11:32 IST)

ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో ఆడకపోతే.. మునిగిపోయేదేమీ లేదు: భజ్జీ

ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్ జట్టుతో ఆడకపోయినా ఏం కాబోదని..  భారత స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ అన్నాడు. పుల్వామా ఘటన నేపథ్యంలో... భవిష్యత్తులో ఇక పాకిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్ ఆడేది కష్టమని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ ఆడకపోతే మునిగిపోయేది ఏమీ లేదని చెప్పాడు. 
 
ప్రపంచ కప్‌లో భాగంగా భారత జట్టు లీగ్ దశలో అన్నీ దేశాలతో ఆడటం, ఆయా మ్యాచ్‌ల ఫలితాలతోనే నాకౌట్ దశకు అవకాశం పొందనుండటంతో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ని బహిష్కరించినా నాకౌచ్ ఛాన్సులు ఏమాత్రం తగ్గే ప్రసక్తే లేదని భజ్జీ వ్యాఖ్యానించాడు. 
 
పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకపోవడం.. టీమిండియా జట్టు విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని భజ్జీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఉగ్రవాదులు జరిగిన దాడుల నేపథ్యంలో.. ఆటలకంటే దేశమే ముఖ్యమని భజ్జీ సంకేతం ఇచ్చాడు. జూన్ 16న పాకిస్థాన్‌తో జరగాల్సిన వన్డే మ్యాచ్‌ని బహిష్కరించాలని సూచించాడు. క్రికెట్‌తో సహా హాకీ, కబడ్డీ వంటి మరే ఇతర క్రీడలనూ పాకిస్థాన్‌తో ఆడకూడదని చెప్పుకొచ్చాడు. 
 
ఉగ్రదాడులు జరుగుతున్న ఇటువంటి క్లిష్ట సమయంలో భద్రతా దళాలకు జాతి యావత్తూ అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సైనికుల త్యాగాలను వృధా పోనివ్వకూడదని పిలుపు నిచ్చాడు.