గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (11:21 IST)

భారత వికెట్ కీపర్ ఔదార్యం... ఉత్తరాఖండ్‌కు విరాళంగా మ్యాచ్ ఫీజు

భారత క్రికెట్ జట్టులోని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. మొన్నటికిమొన్న ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన ఈ కుర్రోడు.. ఇపుడు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ బాగా రాణిస్తున్నాడు. అదేసమయంలో తన ఔదార్యాన్ని చూపించారు. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంచు చరియలు విరిగిపడటంతో జలప్రళయం సంభవించింది. దీంతో గంగానది ఉపనది ధౌలతీగంగపై నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రం నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయింది. ఈ విపత్తులో 150మంది వరకు గల్లంతైనట్టు సమాచారం. 
 
తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోని జోషిమత్ వద్ద జరిగిన జలప్రళయంపై విచారం వ్యక్తం చేస్తూ పంత్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. జలప్రళయం బాధితులను ఆదుకునేందుకు మరింతమంది ముందుకు రావాలని కోరుకుంటున్నానని రిషబ్ కోరారు. 
 
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్-ఇంగ్లాండు జట్ల మధ్య జరిగిన ఓపెనింగ్ టెస్టులో రిషబ్ పంత్ 91 పరుగులు చేశారు. ఉత్తరాఖండ్ సహాయ చర్యల కోసం మొట్టమొదటి సారి విరాళం ప్రకటించిన రిషబ్ పంత్ అందరికీ ఆదర్శంగా నిలిచారు.