పనిమినిషిని హింసించిన కేసు.. దోషులుగా తేలితే.. హుస్సేన్ క్రికెట్ కెరీర్ గోవిందా..!

shahadat hussain with wife
Selvi| Last Updated: గురువారం, 31 డిశెంబరు 2015 (12:33 IST)
పనిమనిషిని హింసించిన కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ దంపతులు దోషులుగా తేలితే అతని కెరీర్ ముగిసినట్లేనని తెలుస్తోంది. షహదత్ హుస్సేన్ దంపతుల ఇంట్లో పనిచేస్తున్న 11 ఏళ్ల బాలికను వేధించి, హింసించినట్టు నమోదైన కేసులో భాగంగా షహదత్ హుస్సేన్ దంపతులు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసు ప్రాథమిక విచారణలో బాలికను హింసించిన మాట వాస్తవమేనని పోలీసులు చెప్తున్నారు.

అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన కెరీర్‌ను దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో పన్నిన కుట్ర ఇదని షహదత్ ఆరోపించాడు. ఈ కేసులో షహదత్ దంపతులు దోషులుగా తేలితే వారికి 14 ఏళ్ల కారాగార శిక్షపడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా బంగ్లాదేశ్ తరపున 38 టెస్టులు, 51 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన షహదత్ హుస్సేన్, అతని భార్య నృటో షహదత్‌‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :