బుధవారం, 4 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

నవంబరు 8 నుంచి భారత్ - సౌతాఫ్రికా టీ20 సిరీస్

south africa team
ఈ నెల 8వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఈ యేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోటీల్లో భారత్‌, సౌతాఫ్రికా జట్ల మధ్య అమితమైన ఆసక్తికర పోటీ జరిగింది. ఈ మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో సఫారీలను ఓడించి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఆ మెగా టోర్నీ తర్వాత టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటిదాకా టీ20ల్లో తలపడలేదు. తాజాగా, ఈ రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది.
 
ఈ నెల 8వ తేదీ నుంచి మొదలయ్యే ఈ సిరీస్‌కు దక్షిణాఫ్రికా ఆతిథ్యమిస్తోంది. ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. నాలుగు టీ20 మ్యాచ్‌ల ఈ సిరీస్‌‍లో ఆడే దక్షిణాఫ్రికా జట్టుకు సీనియర్ బ్యాట్స్‌మన్ ఐడెన్ మార్ క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్ వంటి విధ్వంసకర బ్యాటర్లతో... మార్కో యన్సెన్, గెరాల్డ్ కోటీ వంటి ప్రతిభావంతులైన పేసర్లతో సఫారీ జట్టు బలంగా కనిపిస్తోంది.
 
సౌతాఫ్రికా జట్టు వివరాలు.. 
ఐడెన్ మార్ క్రమ్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, ట్రిస్టాన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఓట్నీల్ బార్ట్ మన్, గెరాల్డ్ కోట్టీ, డోనోవాన్ ఫెరీరా, పాట్రిక్ క్రూగర్, మార్కో యన్సెన్, కేశవ్ మహరాజ్, మిహ్లాలీ ఎంపోగ్వానా, ఎన్ కబ్జా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిలే సిమిలానే, లూథో సిపామ్లా