1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Suresh Raina urges ban on China Products

చైనా వస్తువులను నిషేధించాలి - కరోనా పాపం చైనాదే : సురేష్ రైనా

Suresh Raina
భారత సైన్యంపై అతి కిరాతకంగా దాడి చేసి 20 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న చైనాపై భారత క్రికెటర్ సురేష్ రైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చైనా వస్తువులను తక్షణం నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌పై దాడి చేసిన డ్రాగన్‌ దేశం మన డబ్బుతో నడవకుడదని, చైనా వస్తువులను నిషేధించాలని డిమాండ్ చేశారు. 
 
గాల్వాన్‌ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతి చెందడంతో దేశ వ్యాపంగా చైనా వ్యతిరేక నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సురేశ్‌రైనా స్పందించాడు. ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించేందుకు చైనానే కరోనా వైరస్‌ను సృష్టించిందని అనుమానం వ్యక్తంచేశాడు. 
 
భారత భూమిని కాపాడేందుకు దేశ సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి వర్ణణాతీతమని అన్నాడు. ‘భారత సైన్యం చాలా బాలమైంది. ప్రతీ ఒక్క భారత జవానుకు సెల్యూట్‌’ అని రైనా అన్నారు. 
 
దేశం తరుపున ఆడుతూ ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయడమే మా కర్తవ్యం. భారత ప్రభుత్వం, బీసీసీఐ అనుమతిస్తే సరిహద్దులోకి వెళ్లి జావాన్లకు సాయం చేస్తాం, ప్రతి సైనికుడి వెంట యావత్తు దేశం ఉందని తెలియజేస్తాం అని చెప్పుకొచ్చారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నొవాక్ జకోవిచ్‌కు కరోనా.. ఆయన భార్యకు కూడా..