గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 జూన్ 2020 (11:33 IST)

టెన్నిస్ స్టార్ గ్రిగర్ దిమిత్రోవ్‌కు కరోనా పాజిటివ్

టెన్నిస్‌లో కలకలం చెలరేగింది. టెన్నిస్ స్టార్ గ్రిగర్ దిమిత్రోవ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈయన ఇటీవల ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జకోవిచ్‌తో కలిసి మ్యాచ్ ఆడాడు. ఇపుడు దిమిత్రోవ్‌కు కరోనా పాజిటివ్ రావడం సంచలనం కలిగిస్తోంది. 
 
బెల్ గ్రేడ్‌లో గత వారం ఈ మ్యాచ్ జరిగింది. ఆడ్రియా టూర్ ఈవెంట్‌లో జకోవిచ్, నిమిత్రోవ్ కలిసి డొమినిక్ థీయమ్, అలెగ్జాండర్ జ్వరేవ్ లను ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఎదుర్కొన్నారు.
 
ఆ తర్వాత ఆయన మొనాకోకు చేరి, అస్వస్థత పాలుకాగా, కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని దిమిత్రోవ్ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. గత కొన్ని రోజుల్లో తాను కలిసిన వారిలో ఎవరికో వైరస్ ఉందని ఆయన పేర్కొన్నారు. 
 
"నేను ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నాను. నాకు తెలియకుండా ఎవరికైనా హాని తలపెట్టి ఉంటే నన్ను క్షమించండి. ప్రస్తుతం నేను ఇంట్లోనే రికవరీ అవుతున్నాను. ఈ క్లిష్ట సమయంలో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు" అని వ్యాఖ్యానించారు.
 
కాగా, ఇపుడు నొవాక్ జకోవిచ్‌కు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ప్రస్తుతం ఈయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ పరీక్షల ఫలితాలు వెల్లడైన తర్వాతే ఈయన బయటకువచ్చే అవకాశం ఉంది.