గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 జూన్ 2020 (13:44 IST)

బండ్ల గణేశ్‌కు కరోనా పాజిటివ్... హోం క్వారంటైన్‌కెళ్లిన యువ హీరో!

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆయనకు హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
మరోవైపు, బండ్ల గణేశ్ నివాసం ఉండే ప్రాంతంలో నివసించే యువ హీరో నాగశౌర్య ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయాడు. తన కుటుంబ సభ్యులను తీసుకుని నగర శివారు ప్రాంతంలో ఉన్న ఫాంహౌస్‌కు వెళ్లినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా ఇప్పట్లో షూటింగులలో పాల్గొనే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో భాగ్యనగరికి దూరంగా శివారు ప్రాంతంలో తమకుటుంబానికి చెందిన ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. ఇక్కడే కొద్ది రోజులు ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. 
 
కాగా, ప్రస్తుతం ఆయన ఓ సినిమాలో నటిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో షూటింగులకు విరామం వచ్చింది. లాక్డౌన్ పూర్తయ్యాక ఆయన సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమాలోనూ నటించనున్నాడు.