శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (14:38 IST)

2020 ఫేమస్ డిష్.. కరోనా బర్గర్.. ఫోటో వైరల్

Corona burger
2020వ సంవత్సరం ఓ ఫేమస్ వంటకం ఏంటని.. ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమాటో ట్విట్టర్‌లో అడిగిన ప్రశ్నకు సమాధానాలు వైరల్ అవుతున్నాయి. కరోనా అనే వ్యాధితో ప్రపంచ దేశాలు అట్టుడికిపోతున్న నేపథ్యంలో చైనాలో పుట్టి.. మూడు నెలల సమయంలోనే ప్రపంచ దేశాలకు వ్యాపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. 
 
దీనిని నియంత్రించేందుకు లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమాటో 2020వ సంవత్సరం ఏ ఫుడ్ ఫేవరేట్‌గా వుంటుందని.. ఏ డిష్ ఫేవరెట్‌గా వుంటుందని అడిగివ ప్రశ్నకు చాలామంది ''కరోనా బర్గర్'', పిజ్జా అంటూ పలు వెరైటీలను కామెంట్స్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.