కింగ్‌స్టన్ చేరుకున్న భారత క్రికెట్ జట్టు.. వీడియో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్...
ఈనెల 30వ తేదీ నుంచి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం భారత క్రికెట్ జట్టు కింగ్‌స్టన్‌కు చేరుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్ 30 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరుగనుంది.
ఈనెల 30వ తేదీ నుంచి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం భారత క్రికెట్ జట్టు కింగ్‌స్టన్‌కు చేరుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్ 30 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరుగనుంది. భారత జట్టు రెండో టెస్టు కోసం జమైకా నుంచి బయలుదేరి కింగ్‌స్టన్ చేరుకుందని బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పింది.
ఆ తర్వాత వెస్టిండీస్‌తో మూడో టెస్టు ఆగస్టు 9 నుంచి 13 వరకు జరగనుండగా నాలుగో టెస్టు ఆగస్టు 18 నుంచి 22 వరకు జరుగుతుంది. కాగా, ఇప్పటికే ఆంటిగ్వా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 92 పరుగుల ఆధిక్యంతో గెలుపొంది నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకున్న విషయం తెల్సిందే.
మరోవైపు... వెస్టిండీస్ను వారి సొంతగడ్డపై తొలి టెస్టులో ఇన్నింగ్స్ 92 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమిండియా ప్రస్తుతం హాయిగా కాలక్షేపం చేస్తుంది. కేవలం నాలుగు రోజుల్లోనే విండీస్ భరతం పట్టిన టీమిండియా ఆటగాళ్లు చాలా సీరియస్గా వీడియో గేమ్ ఆడుతూ కనిపించారు.
చటేశ్వర్ పుజారా, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్.. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి వీడియో గేమ్స్ ఆడారు. శిఖర్ ధావన్ ఈ విషయంపై సరదాగా ట్వీట్ చేశాడు. రెండు జట్లుగా విడిపోయి వీళ్లు ఫుట్‌బాల్ వీడియో గేమ్ ఆడారు. చాలా కాంపిటీషన్ ఎదుర్కొటున్నట్లు సీరియస్‌గా గేమ్ ఆడుతున్నారంటూ ధావన్ ట్వీట్ చేశాడు.
మరో ట్వీట్‌లో రవీంద్ర జడేజాతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఇక్కడ చాలా పచ్చగా ఉందని, ప్రశాంత వాతావరణం, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు అని తన పోస్ట్‌లో ధావన్ రాసుకొచ్చాడు.