సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 1 ఏప్రియల్ 2017 (09:18 IST)

విరాట్ కోహ్లీ ఇక విశ్రాంతి తీసుకోవలసిన సమయం వచ్చిందా?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లా ఇక విశ్రాంతి తీసుకోవలసిన సమయం ఆసన్నమైందా.. అవుననే ఉంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్. ఆస్ట్రేలియాతో భీకర పోరాటం సీరీస్ విజయంతో ముగిసిన తర్వాత తన బ్యాటింగ్ మరియు నాయకత్వ శైలి‌పై అంతర్మథనం

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లా ఇక విశ్రాంతి తీసుకోవలసిన సమయం ఆసన్నమైందా.. అవుననే ఉంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్. ఆస్ట్రేలియాతో భీకర పోరాటం సీరీస్ విజయంతో ముగిసిన తర్వాత తన బ్యాటింగ్ మరియు నాయకత్వ శైలి‌పై అంతర్మథనం చేసుకోవడానికి వీలుగా కోహ్లీ కొంతకాలం క్రికెట్ నుంచి బ్రేక్ తేసుకోవలసిన అవసరం ఉందని బ్రాడ్ అబిప్రాయ పడ్డారు. సీరీస్‌ని 2-1 తేడాతో గెల్చుకున్న సమయంలో తనలో ప్రకటితమైన అంశాలపై స్వీయ అంచనాకు రావడానికి విరాట్ కొంత కాలం క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాల్సిందేనని బ్రాడ్ సూచించారు.
 
ఏదేమైనా ఏప్రిల్ 6 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ ప్రారంభ గేమ్స్‌ను కోహ్లీ మిస్ అవుతున్న మాట నిజం, మూడో టెస్టులో భుజానికి గాయం తగలడంతో కోహ్లీ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. స్వదేశంలో బలమైన ప్రత్యర్థితో తలపడిన భారత్ అద్బుతమైన ఆటతీరుతో సీరీస్‌ని నిలబెట్టుకుంది. ఇంచ ఒత్తిడిని అనుభించడం, దానికి తోడు భుజానికి గాయం తగలడం నేపథ్యంలో బ్యాట్స్‌మన్గా కెప్టెన్‌గా కోహ్లీ తనకు తాను లోతుగా అంచనా వేసుకోవలసిన సందర్బం ఆసన్నమైందని బ్రాడ్ చెప్పాడు.
 
ఆటకు కొన్నాళ్లు దూరం కావడం ద్వారానే కోహ్లీ గత ఆరు వారాలుగా భారత్‌ను చాలెంజ్ చేసిన ఆస్ట్రేలియాతో భీకరపోరాటం ఏ విషయాన్ని బహిర్గతం చేసిందన్న అంశంపై కోహ్లీ తీరుబడిగా ఆలోచించుకుంటే మంచిది. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇంతవరకు ఎదురుకాని అత్యంత క్లిష్ట సమయం కోహ్లీకి ఆస్ట్రేలియాతో సీరీస్ ద్వారానే ఎదురైంది. అందుకే కోహ్లీ తనకు ఎదురైన చేదు అనుభవాలను తీరుబడిగా ఆలోచించుకోవలసిన తరుణం ఆసన్నమైందని బ్రాడ్ సూచించాడు.