ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 28 మే 2017 (16:27 IST)

కుంబ్లేను ఢీకొట్టేందుకు సై అంటున్న సెహ్వాంగ్.. ఏ విషయంలో....

భారత క్రికెట్ జట్టు దిగ్గజం అనిల్ కుంబ్లేను ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నారు. ఇంతకీ ఎక్కడ, ఎందుకు ఢీకొడతారనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం

భారత క్రికెట్ జట్టు దిగ్గజం అనిల్ కుంబ్లేను ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నారు. ఇంతకీ ఎక్కడ, ఎందుకు ఢీకొడతారనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే విధులు నిర్వహిస్తున్నారు. ఈయన పదవీ కాలం చాంపియన్స్ ట్రోఫీ ముగియగానే పూర్తి కానుంది. దీంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించే బదులు మరోసారి దరఖాస్తులు ఆహ్వానించాలని బీసీసీఐ నిర్ణయించడంతో డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రంగంలోకి దిగాడు.
 
పలు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల మేరకు, బీసీసీఐ జనరల్ మేనేజర్లలో ఒకరు సెహ్వాగ్‌ను సంప్రదించి, ఈ పదవికి దరఖాస్తు చేసుకోవాలని కోరారని తెలుస్తోంది. ఇప్పటికే కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కోచ్‌గా సేవలందించిన ఆయన అనుభవం ఈ పదవికి ఉపకరిస్తుందని కూడా సదరు జీఎం సలహా ఇచ్చారని సమాచారం. కాగా, ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కూడా హెడ్ కోచ్ పోస్టుకు పోటీ పడవచ్చని వార్తలు వస్తున్నాయి.