మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:13 IST)

సెహ్వాగ్ ట్వీట్‌పై పెదవి విరిచిన నెటిజన్లు.. హాస్యం ఎక్కడయ్యా బాబు..?

భారత క్రికెట్‌లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న వీరేంద్ర సెహ్వాగ్‌ను డాషింగ్ ఓపెనర్‌గా అందిరికీ తెలుసు. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. సెహ్వాగ్ మాత్రం ట్విట్టర్లో ఫ్యాన్స్‌ను పలకరిస్తూ

భారత క్రికెట్‌లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న వీరేంద్ర సెహ్వాగ్‌ను డాషింగ్ ఓపెనర్‌గా అందిరికీ తెలుసు. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. సెహ్వాగ్ మాత్రం ట్విట్టర్లో ఫ్యాన్స్‌ను పలకరిస్తూనే ఉన్నాడు. అదీ చమత్కారం, హాస్యంతో కూడిన ట్వీట్లతో. కేవలం 140 అక్షరాలతో సందర్భానుసారంగా క్రికెటర్లు, ప్రముఖులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సోషల్‌ మీడియాలోనూ సరికొత్త ట్రెండ్‌ సెట్‌ చేశాడు. తాజాగా వీరూ చేసిన ఓ ట్వీట్‌పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్వీట్‌లో హాస్యం లేదని మండిపడుతున్నారు.  
 
ఎవరికైనా శుభాకాంక్షలు, అభినందనలు చెప్పడంలో వీరూ స్టైలే వేరు. అందులో కొంచెం హాస్యం, పదాల్లో ప్రాసను మిళితం చేస్తాడు. కానీ క్రికెటర్‌ శ్రీశాంత్‌కు సెహ్వాగ్‌ తెలిపిన జన్మదిన శుభాకాంక్షల తీరుపై అభిమానులు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

'హ్యాపీ బర్త్‌డే శ్రీశాంత్‌. ఎంజాయ్‌' అని మాత్రమే సెహ్వాగ్‌ ట్వీట్‌ చేసి.. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఔట్‌ కోసం అప్పీలు చేస్తున్న శ్రీశాంత్‌ ఫోటోను ఈ సందర్భంగా పోస్ట్‌ చేశాడు. సెహ్వాగ్‌ ట్వీట్లలో హాస్యానికి అలవాటు పడ్డ అభిమానులు సాదాసీదాగా శుభాకాంక్షలు చెప్పడంతో ట్విట్టర్‌ వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.