1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Is Mahesh Babu’s character modeled after Tom Cruise? Varanasi rights sold for ₹300 crore

Mytri movies Varanasi : టామ్ క్రూయిజ్ తరహాలో మహేష్ బాబు పాత్ర ? ₹300 కోట్లకు వారణాసి హక్కులు

Mahesh Babu and Tom Cruise
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో రూపొందిస్తున్న వారణాసి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్ మైత్రి మూవీ మేకర్స్ తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. నేడు అందుకు తగినవిధంగా ఓ వార్త ఫిలింనగర్ లో వినిపిస్తోంది. 
 
 
మైత్రి మూవీ మేకర్స్, రాజమౌళి 'RRR' నెలకొల్పిన మునుపటి రికార్డును అధిగమించి, తెలుగు రాష్ట్రాల్లో 'వారణాసి' హక్కులను దక్కించుకుంది. ₹15 కోట్ల రికవరీ విలువ తర్వాత ఈ హక్కుల ప్రభావవంతమైన విలువ ₹285 కోట్లుగా నమోదైంది. మహేష్ బాబు పోషించిన రుద్ర పాత్ర, ప్రియాంక చోప్రా జోనస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కలిసి, ఒక గ్రహశకలం వంటి ముప్పులను ఎదుర్కొంటూ ప్రపంచాన్ని చుట్టివచ్చే సాహసయాత్ర చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. 
 
వారణాసి నుండి అంటార్కిటికా వరకు వివిధ ప్రదేశాలలో చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్ 7, 2027న IMAX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ పౌరాణిక ఇతిహాసం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను అందుకుంటుందని ఈ ఒప్పందం సూచిస్తోంది.
 
కాగా, వారణాసి’ బిజినెస్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ గా సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. రూ.300 కోట్ల డీల్‌లో రూ.15 కోట్లు రికవరబుల్ అమౌంట్. నికర డీల్ విలువ రూ.285 కోట్లు! అడ్వాన్స్ చెల్లింపు పూర్తి, డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం.

ఇదిలా వుండగా, మహేష్ బాబు నందీశ్వరునిపై స్వారీ చేస్తున్న సీన్ ను టీజర్ సమయంలోనే విడుదల చేశారు. అది హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిజ్ నటించిన ద లాస్ట్ సమురాయ్ ను పోలివుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాహుబలిలో కూడా పలు చైనీస్ సినిమాలను స్పూర్తిగా తీసుకుని రాజమౌళి చాలా సన్నివేశాలు చిత్రీకరించిన విషయం తెలిసిందే.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Chiranjeevi : AI దుర్వినియోగంపై కిషన్ రెడ్డి కి మెగాస్టార్ చిరంజీవి వినతిపత్రం