అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన యూసుఫ్ పఠాన్!
తనను అసభ్య పదజాలంతో దూషించిన ఓ అభిమాని చెంప ఛెళ్లుమనిపించాడు భారత క్రికెటర్ యూసుఫ్ ఫఠాన్. తన గురించి అసభ్య వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని డ్రెస్సింగ్ రూంలోకి పిలిచిమరీ చెంప పగులగొట్టాడు. ఈ ఘటన బరోడా, జమ్మూ కాశ్మీర్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ సమయంలో చోటుచేసుకుంది.
ఆ యువకుడు పఠాన్‌తో పాటు అంబటి రాయుడిని సైతం దూషించినట్లు బరోడా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి స్నేహాల్ పారిఖ్ తెలిపారు. పలుమార్లు ఆ యువకుడు దుర్భాషలాడాడని, అందువల్లే పఠాన్ కోపం ఆపుకోలేకపోయాడని వివరించారు. యూసఫ్‌ను అతని సోదరుడు ఇర్ఫాన్ అదుపు చేయగా, ఆ యువకుని బంధువు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగిందని స్నేహాల్ వివరించారు.