సంబంధిత వార్తలు
- 50 మ్యాచ్‌ల్లో నాటౌట్.. ధోనీ రికార్డు అదుర్స్.. కేవలం 2 మ్యాచ్‌ల్లోనే ఓటమి..
- క్రికెట్ వరల్డ్ కప్-2019: 1992 మాదిరిగా ఆడుతున్న పాక్... అప్పట్లాగే ఇప్పుడూ కప్ కొడుతుందా?
- బోరుమని ఏడుస్తున్న వకార్ యూనిస్... భారత్ కావాలనే ఓడిందట
- సూర్యగ్రహణం.. భగవన్నామస్మరణ.. ఉపవాసం.. దానాలు చేస్తే? (video)
- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ : వన్డేల్లో ఎవరి సత్తా ఎంత?
వరల్డ్ కప్ 2019 : టాస్ గెలిచిన కోహ్లీ... భారత్ బ్యాటింగ్.. వారిద్దరూ ఔట్
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా మంగళవారం భారత్ - బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇదే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ అనుభవంతో కోహ్లీ తొలుత బ్యాటింగ్‌కు మొగ్గు చూపాడు. పైగా, స్టేడియంలో బౌండరీ లైన్‌లో వ్యత్యాసాలు ఉండటం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చిక్కులు ఎదురైన సమస్యల దృష్ట్యా కోహ్లీ బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కుల్దీప్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్, కేదార్ జాదవ్ స్థానంలో దినేష్ కార్తీక్‌లకు చోటు కల్పించారు.
భారత జట్టు : కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, ధోనీ, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, షమీ, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చాహల్. ఇక బంగ్లాదేశ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు.
బంగ్లాదేశ్ జట్టు : ఇక్బాల్, సర్కార్, షకీబ్ అల్ హాసన్, రహీం, లిటాన్ దాస్, హోస్సేన్, షబ్బీర్ రెహ్మాన్, సైఫుద్దీన్, మోర్తాజా, రూబెల్ హుస్సేన్, ముస్తాఫర్ రెహ్మాన్.
