బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 25 మే 2024 (16:08 IST)

సాఫ్ట్వేర్ టెక్కీ భార్యను హత్య చేసి ముక్కలు చేయాలని గ్యాస్ బండతో: భర్త రాక్షసం

couple
ఉమ్మడి కుటుంబాలు వున్నప్పుడు నేరాలు, ఘోరాలు కాస్త తక్కువగా వుండేవి. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావడంతో జంటలు మాత్రమే ఎవరికివారు వుంటున్నారు. ఏ చిన్న వివాదం చెలరేగినా అది తీవ్రమైన పరిణామానికి దారితీస్తోంది. ఇలాంటి వాటిలో హత్యలు, విడాకులు వుంటున్నాయి. చిన్నచిన్న వివాదాలనే సర్దుబాటు చేసుకోలేక ఇగోలకి పోయి క్షణికావేశంలో హత్యలు చేస్తున్న సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ బాచుపల్లిలో ఇదే జరిగింది.
 
పూర్తి వివరాలను చూస్తే... సాయి అనురాగ్ కాలనీలో వుంటున్న నాగేంద్ర భరద్వాజ్, మధులత ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా. 2020లో ఇద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు కూడా వున్నాడు. భార్యాభర్తలిద్దరూ బాచుపల్లి సాయి అనురాగ్ కాలనీలోని అపార్టుమెంట్లో వుంటున్నారు. భార్య మధులతపై భర్త భరద్వాజ్ చీటికిమాటికీ భౌతిక దాడులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఆమెతో మరోసారి గొడవపడ్డాడు. అది మరింత పెద్దదయిపోవడంతో తీవ్ర కోపానికి గురై కత్తితో మధులత మెడపై పొడిచాడు.
 
ఆ తర్వాత శరీరంపై పలుచోట్లు పొడిచి హత్య చేసాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పడేసి తప్పించుకుందామని ప్రయత్నించాడు. అధి సాధ్యం కాకపోవడంతో వంటగదిలో సిలిండరు పెట్టి అగ్నిప్రమాదంలో భార్య మరణించిందని చూపాలని ప్రయత్నించాడు. కానీ అవేమీ ఫలించకపోవడంతో ఇంటికి తాళం పెట్టి కుమారుడిని తీసుకుని తన మిత్రుడు వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీనితో అతని స్నేహితుడు 100కి ఫోన్ చేయడంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. మధులత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.