ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 డిశెంబరు 2023 (15:37 IST)

25 ఏళ్ల యువతి దారుణ హత్య, పెట్రోల్ పోసి తగులబెట్టారు

murder
తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు కొందరు 25 ఏళ్ల యువతిని హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు. హైదరాబాద్-మెదక్ జాతీయ రహదారి పక్కనే సగం కాలిపోయిన స్థితిలో వున్న యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారాన్ని పోలీసులకు తెలిపారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలి ఒంటిపై కాషాయం రంగు టాప్, ఎరుపు లెగిన్ వున్నాయని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఈ ఆనవాళ్లను గుర్తించినా లేదంటే మిస్సింగ్ కేసు వున్నా పోలీసులను సంప్రదించాలని తెలిపారు.