శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 10 సెప్టెంబరు 2022 (20:32 IST)

ప్రియుడే కదా అని దగ్గరైంది, అసలు రూపం చూపించాడు

woman
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నావ్ కి చెందిన ఓ యువతిని మోనూ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడేవాడు. ఐతే అతడిని దూరం పెట్టింది యువతి. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ఆమె వెంటపడుతూ కాళ్లావేళ్లా పడటం ప్రారంభించాడు. నువ్వు కాదంటే చనిపోతానంటూ మాయమాటలు చెప్పాడు. ఆ మాటలకు ఆమె జాలిపడింది. అతడి ప్రేమ నిజమేనని నమ్మింది.

 
ఈ క్రమంలో అతడితో సన్నిహితమైంది. దాన్ని ఆసరగా చేసుకున్న మోనూ ఆమెను లొంగదీసుకుని పలుమార్లు శారీరకంగా కలిసాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న మోనూ మరోసారి ఆమెను మాయమాటలతో ఆమెకి అబార్షన్ చేయించాడు. పెళ్లెప్పుడు అని అడిగితే మాత్రం ముఖం చాటేసేవాడు. పైగా తనకు ఆర్థికంగా ఇబ్బందులు వున్నాయంటూ బాధితురాలి నుంచి రూ. 2 లక్షలు తీసుకున్నాడు.

 
ఆ తర్వాత ఆమెకి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడు తనను మోసం చేసాడని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే దర్యాప్తులో నిందితుడు పేరు మోనూ కాదనీ అతడి పేరు షెహ్నవాజ్ కబాడీ అని పోలీసులు తేల్చారు. అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.