1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (23:06 IST)

చదువుకుంటానని వెళ్లిన యువతి హాస్టల్ గదిలో శవమై తేలింది, ఏమైందంటే..?

చదువులో ముందున్న తన కుమార్తెను ఉన్నత చదువులు చదివిస్తే తమకు పేరుప్రఖ్యాతులు తెస్తుందని ఆ తల్లిదండ్రులు ఆనంద పడ్డారు. ఆ చదువే తమ కుమార్తెను మృత్యువు ఒడికి చేరుస్తుందని ఊహించలేక పోయారు.


ప్రమాదవశాత్తు గానీ, అనారోగ్య కారణంగా గానీ మృతి చేందితే ఆయుష్షు తీరిందనో భావిస్తాం. కానీ‌ ఒంటిపై గాయాలు, మెడపై త్రాడుతో బిగించిన గుర్తులతో మృతి చెందితే‌ ఇక మరణంపై ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు వస్తాయి. తిరుపతిలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ స్కిల్‌ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్ చదువుతున్న అనితా రెడ్డి మృతిపై అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.
 
చిత్తూరు జిల్లా వి.కోట మండలం, ఆరిమాకుల గ్రామానికి చేందిన అనితరెడ్డి చిన్నతనం నుండి చదువులో ఎంతో చురుకుగా ఉంటూ తోటి విద్యార్థుల కంటే ముందుండేది. అందరితోనూ చలాకీగా ఉండే అనిత రెడ్డి గత ఏడాది డిగ్రీ పూర్తి చేసింది. అయితే తనకు ఉద్యోగం చేయాలని ఉందని స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ తీసుకోవాలని తల్లిదండ్రులను కోరింది. అయితే ఒంటరిగా తమ కుమార్తెను బయట ప్రాంతానికి పంపేదులు భయటపడిన అనితారెడ్డి తల్లిదండ్రులు మొదట్లో అనిత మాటలకు ఒప్పుకోలేదు.
 
ఖచ్చితంగా తను డెవలప్మెంట్ కోచింగ్‌కి వెళ్ళాలని పట్టుబట్టి మరీ తల్లిదండ్రులను ఒప్పించి అనితా.. ఈ క్రమంలో‌ గత రెండు నెలల క్రితం తిరుపతి రూరల్‌ మండలం, తాడితోపు సమీపంలోని సెంట్రల్‌ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగే స్కిల్‌ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్లో చేరింది. ఈ కోచింగ్ సెంటర్లో హాస్టల్ వసతి ఉండటంతో అక్కడే 18 మంది యువతులు, పది మంది యవకులు ఉంటున్నారు. మొదటి ఫ్లోర్ యువకులు, మూడో ఫ్లోర్లో అమ్మాయిలు బస చేసే విధంగా అక్కడి‌ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది.
 
సుమిత్ర నగర్‌లో ఉండే హాస్టల్లో ఉండే అనిత నిన్న తోటి విద్యార్థునులతో యాధావిధిగా క్లాస్‌కి వెళ్ళి హాస్టల్‌కి తిరిగి వచ్చింది. ఐతే మధ్యాహ్నం భోజనానికి వెళ్లే ముందు బాత్రూంకి వెళ్ళింది. అనిత భోజనం చేసేందుకు తోటి విద్యార్ధినులు ప్లేస్‌ను కూడా సిద్దం చేసినా అనిత రాకపోయేసరికి విద్యార్ధినులు ఎదురుచూసి తర్వాత వస్తుందిలే అని క్లాస్‌కి వెళ్ళిపోయారు. ఎంతకీ అనిత తిరిగి రాకపోవడంతో హాస్టల్‌లో‌ ఉండే విద్యార్థులు అనిత ఏమైందని బాత్రూం వద్దకు వెళ్లి పరిశీలించారు. బాత్రూంలో విగతజీవిగా‌ పడి ఉన్న అనితను చూసి హాస్టల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా.. హుటాహుటిని అనితను ఆసుపత్రికి తరలించారు.
 
అప్పటికే అనిత మృతిచెంది ఉండటంతో‌ అనిత‌ మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలలో‌ ఉంచారు. అనిత మృతి చెందిందనే వార్త వినగానే తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు‌మున్నీరు అయ్యారు. తమ బిడ్డను హాస్టల్లోనే ఎవరో అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పి ఎస్వీ మెడికల్ కళాశాలలో‌ పోస్టుమార్టం దగ్గర అనిత మృతిదేహాన్ని ఉంచారని అనిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
తమ కుమార్తె అనిత మృతిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని‌ అనిత తండ్రి వెంకటరత్నం రెడ్డి తిరుపతి ‌ఎం.ఆర్.పల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అనితది హత్య లేక ఆత్యహత్య అనే విషయం‌ మాత్రం‌ పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.